ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి భారీ స్థాయిలో సినిమాలు సందడి చేయనున్నాయి. ఇప్పటికే సంక్రాంతి బరిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, వెంకటేశ్ యాక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఉన్నాయి. అయితే ఈ మూడు సినిమాలో వేటికవే ప్రత్యేక జానర్‌లో రూపొందినట్లు టీజర్లు చూస్తే తెలుస్తోంది. ముందుగా జనవరి 10వ తేదీన రామ్‌చరణ్- శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న గేమ్ ఛేంజర్ విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం ఈ మూవీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం రూ. 131 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 222 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. గేమ్ ఛేంజర్ మూవీ హిట్ కావాలంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ. 224 కోట్ల కలెక్షన్లు సాధించాల్సి ఉంది.
ఇక చరణ్ తర్వాత ప్రేక్షకుల మందుకు వస్తోన్న మరో స్టార్ హీరో బాలకృష్ణ. ఆయన బాబీ దర్శకత్వంలో నటించిన డాకు మహారాజ్ జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఇకపోతే ఈ మూవీ రిలీజ్‌కు ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం రూ. 74 కోట్ల బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 85 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య సినిమా డాకు మహారాజ్ హిట్ కావాలంటే మినిమమ్ రూ. 90 కోట్లు సాధించాల్సి ఉంది.
ఇక రామ్ చరణ్, బాలకృష్ణ తర్వాత సంక్రాంతి రోజే బరిలో నిలుస్తున్న మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్. అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం రూ. 34 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
0 Comments