Game Changer Pre Release Event: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. రిలీజ్ సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టాలని చూస్తోంది. అందుకు తగ్గట్లుగానే మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, బైట్స్ విడుదల చేస్తూనే ఉంది.
అయితే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ సర్కిల్‌లో గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే నిర్మాత దిల్ రాజు కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పటికే పర్మిషన్ కూడా తీసుకున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ బాబాయ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌ను చిత్ర నిర్మాత దిల్ రాజు, హీరో రామ్ చరణ్ కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రావాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జనవరి 4వ తేదీన రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నిర్మాత దిల్ రాజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈవెంట్ తేదీ, ముఖ్య అతిథి లాంటి విషయాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రామ్ చరణ్, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించటం చాలా అరుదు. దీంతో గేమ్ ఛేంజర్ కోసం ఒకే వేదికపై కనిపించనున్నారని తెలిసిన మెగా అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్‌సీ 16 మూవీ కోసం మైసూర్ వెళ్లారు. ఆర్‌సీ 16కి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
0 Comments