కీర్తి సురేష్.. తెలుగు అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహానటితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. అయితే ఇటీవల పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు కీర్తి. ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరూ? ఏం చేస్తుంటాడు? లవ్ మ్యారేజా లేక పెద్దలు కుదిర్చిన సంబంధమా? అసలు ఎవరీ ఆంటోనీ తట్టిల్ అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
కీర్తి సురేష్‌కు కాబోయే భర్త ఆంటోనీ తట్టిల్. ఇటీవల కీర్తి తండ్రి సురేష్ కుమార్ అధికారికంగా ప్రకటించారు కూడా. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు కానీ ఆంటోనీతోనే కీర్తి పెళ్లి అని తేల్చి చెప్పారు. దీంతో అసలు ఆంటోనీ తట్టిల్ ఎవరూ అని అందరూ తెగ వెతికేస్తున్నారు.
తెలుగులో మహానటి, దసరా మూవీలతో అదరగొట్టింది కీర్తి. ఈ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ మహానటి స్వతహాగా మలయాళీ ముద్దుగుమ్మ. తండ్రి నిర్మాత, తల్లి మేనక నటి కావడంతో మలయాళంలో కూడా కీర్తికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. అయితే కీర్తి సురేష్ తనకు ఒక తోడు ఉందని ఎప్పటినుంచో చెబుతూనే ఉంది. అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యక్తితో కీర్తి ప్రేమ వ్యవహారం నడుస్తోందని అనుకున్నారు. కానీ ఆంటోనీ గురించి ఫిల్మ్ మీడియా పెద్దగా ఫోకస్ చేయలేకపోయింది. మొన్నటివరకు ఇద్దరీ ఫొటో ఒక్కటీ కూడా సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ పబ్లిష్ కాలేదు. అదీ కీర్తి సురేష్ విశేషం.
ఆంటోనీ తట్టిల్ చాలా సాధారణ జీవితాన్ని ఇష్టపడే వ్యక్తి అని తెలుస్తోంది. తన ప్రేయసి కీర్తి సురేష్ తో కలిసి పబ్లిక్‌గా తిరిగిన దాఖలాలు లేవు. సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టడం, కీర్తి ఫిల్మ్ ఫంక్షన్స్‌కి రావడం లాంటివి ఆంటోనీ చేయలేదు. పైగా ఆంటోనీ ఇండస్ట్రీ మనిషికాదు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే కీర్తి- ఆంటోనీల ప్రేమ బంధం ఇప్పటిది కాదు. 15 ఏళ్లుగా నడుస్తున్న వ్యవహారమే. రెండు కుటుంబాల్లోనూ వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. దాదాపు ఇద్దరూ ఇంటర్ సమయంలో లవ్‌లో పడినట్లు కథనాలు చెబుతున్నాయి. ఇన్నేళ్లుయినా ఇద్దరిదీ వేరే రంగాలైన వారి లవ్ అలాగే పెరిగిపోయింది. ఎప్పుడో మొదలైన వీళ్ల ప్రేమ ఇప్పటివరకు అలాగే కొనసాగి పెళ్లి దాకా రావడం ఒక విశేషమనే చెప్పాలి. ఆంటోనీ ఓ ఇంజనీర్. నివేదికల ప్రకారం.. ఆంటోనీ తట్టిల్ ఖతార్‌లో కొన్నేళ్లు పనిచేశాడు. ఆ తర్వాత కొచ్చికి వచ్చి సొంతంగా ఓ కంపెనీ పెట్టాడు. ఆంటోనీకి హోటల్ వ్యాపారాలు కూడా ఉన్నాయి.
0 Comments