గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. అయితే ఈ మూవీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ బిగ్ సర్‌ప్రైజ్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు మాస్ బీట్ సాంగ్స్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సింగిల్ ఈనెల 28న విడుదల చేయనున్నట్లు సంగీత దర్శకుడు థమన్ తాజాగా వెల్లడించాడు.
https://twitter.com/MusicThaman/status/1861439283061502027
ఈ మూవీ నుంచి ననాహైరానా అంటూ సాగే మూడో పాటను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. దీనిలో భాగంగా పాట రికార్డింగ్ సమయంలో సింగర్స్ శ్రేయా గోషల్, కార్తీక్ మాట్లాడిన వీడియోను బీటీఎస్ పేరుతో థమన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రామజోగయ్య శాస్త్రి రాసిని ఈ పాట పూర్తి మెలోడిగా సాగనున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది.
ఇకపోతే రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. గతంలో వీరిద్దరూ కలిసి వీర విధేయ రామ మూవీలో యాక్ట్ చేయగా.. ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. రామ్ చరణ్ రాజమౌళి మూవీ త్రిబుల్ ఆర్ తర్వాత వస్తోన్న మూవీ కావడంతో అభిమానులు సైతం గేమ్ ఛేంజర్‌పై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన జరగండి.. జరగండి పాట, రా మచ్చా మచ్చా సాంగ్స్ విడుదలై సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన టీజర్ సైతం ఆకట్టుకుంది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న విడుదల కానుంది. ఈ మూవీలో చరణ్‌తో పాటు శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సునీల్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక గేమ్ ఛేంజర్‌ను నిర్మాత దిల్ రాజు శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతుందని సమాచారం. డిసెంబర్‌లో అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు
0 Comments